»Person Arrested On Selling Tirumala Darshan Tickets In Black
Darshan Tickets తిరుమలలో బ్లాక్ టిక్కెట్లు.. ఒక్క టికెట్ రూ.5 వేలు
తిరుమలలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. రోజు ఎవరో ఒకరు శ్రీవారి భక్తులను రకరకాలగా దోచుకుంటున్నారు. టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులు మాత్రం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
వరుసగా అక్రమాలు, నిషేధిత పదార్థాలు లభించడం, అన్యమత ప్రచారం వంటివి తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. హిందూ ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలుస్తున్న తిరుమలలో అరాచకాలు జరుగుతున్నాయి. కలియుగ దైవంగా భావించే తిరుమల క్షేత్రంలో జరగకూడని పనులు సాగుతున్నాయి. తిరుమలలో అపచారం జరుగుతోంది. గతంలో మద్యం (Liqour), మాంసం (Meat) పట్టుబడిన సంఘటనలు మరువకముందే గంజాయి (Ganja) లభించింది. తాజాగా బ్లాక్ లో దర్శన టికెట్లు (Darshan Tickets) విక్రయించడం కలకలం రేపుతున్నది.
తిరుపతి జిల్లా (Tirupati District) తిరుమలలో అక్రమంగా దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 టిక్కెట్లను రూ.18 వేలుకు విక్రయిస్తున్న వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (Tirumala Tirupati Devasthanam -TTD) విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. మధురై (Madurai)కు చెందిన భక్తులకు 4 టిక్కెట్స్ రూ.18 వేలకు విక్రయించిన సమాచారం పోలీసులకు అందింది. ఒక్కో టికెట్ దాదాపు రూ.4,500కు విక్రయించాడు. వెంటనే విజిలెన్స్ అధికారులు (Vigilance Officer) వల పన్ని నిందితుడిని పట్టుకున్నారు. అతడికి టిక్కెట్లు ఎలా లభించాయనేది చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో ప్రతిదీ వ్యాపారమయమైందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దర్శన టిక్కెట్ల విషయంలో నిబంధనలు వదిలేసి ఇష్టారాజ్యంగా టీటీడీ వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇక తిరుమలలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. రోజు ఎవరో ఒకరు శ్రీవారి భక్తులను రకరకాలగా దోచుకుంటున్నారు. టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులు మాత్రం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా టికెట్ల దందా యథేచ్చగా సాగుతోందని తిరుమల కొండపై ప్రచారం జరుగుతోంది. దీని వెనుక కొందరు అధికార పార్టీ నాయకులు ఉన్నారని సమాచారం.