»Nellore Tdp Seniors Are Anger On Kotamreddy Giridhar
Kotamreddy giridharపై నెల్లూరు టీడీపీ సీనియర్ల గుస్సా.. చంద్రబాబు వద్దకు
Kotamreddy giridhar:కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotamreddy giridhar) టీడీపీలో చేరడంతో నెల్లూరు టీడీపీలో చిచ్చురేపింది. ఆయన పార్టీలో చేరికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (sridhar reddy) సోదరుడే గిరిధర్ రెడ్డి.. ఆ తర్వాత శ్రీధర్ (sridhar) కూడా పార్టీలో చేరతారు.
Nellore tdp seniors are anger on kotamreddy giridhar
Kotamreddy giridhar:కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotamreddy giridhar) టీడీపీలో చేరడంతో నెల్లూరు టీడీపీలో చిచ్చురేపింది. ఆయన పార్టీలో చేరికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (sridhar reddy) సోదరుడే గిరిధర్ రెడ్డి.. ఆ తర్వాత శ్రీధర్ (sridhar) కూడా పార్టీలో చేరతారు. గిరి (giri) చేరికనే పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) వ్యతిరేకించారు. నెల్లూరు రూరల్ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ (abdul azeez) కూడా గుస్సా మీదున్నారు.
జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ (narayana) అనుచరుడు పట్టాభి (pattabhi).. గిరిధర్ రెడ్డి (Kotamreddy giridhar) పార్టీలో చేరిక విషయంలో కీ రోల్ పోషించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్‌కు (azeez) వ్యతిరేకంగా పట్టాభి తలదూర్చడట. గిరిధర్ (giridhar) విషయంలోనే ఇతర అంశాలు చాలానే ఉన్నాయట. అందుకే నారాయణ (narayana) వద్ద విషయం తేల్చుకున్నారని తెలిసింది. ఇలా గిరి (giri) రాకతో ఇలా ఉంటే.. శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరితే పరిస్థితి ఏంటీ అనే చర్చ జరుగుతుంది.
మరోవైపు గిరి (giri) చేరికకు సంబంధించి ప్లెక్సీల్లో కూడా కోటంరెడ్డి బ్రదర్స్ (kotamreddy brothers) ఫోటోలే ఉన్నాయి. సీనియర్ నేతల ఫోటోలు కనిపించలేదు. చంద్రబాబు (chandrababu), లోకేశ్ (lokesh), బాలకృష్ణ (balakrishna) ఫోటోలు మాత్రమే ఉన్నాయి. సోమిరెడ్డి (somireddy), అజీజ్ (azeez) సహా ఇతర నేతల ఫోటోలు లేకపోవడంతో.. సీనియర్లు రగిలిపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో లోకేశ్ (lokesh) టీమ్‌గా చెప్పుకునే వారే బరిలో ఉంటారని సమాచారం. ఇప్పటికే చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయిన వారిని పక్కకు పెడతారట. తమకు అవకాశం వస్తుందో రాదోనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లో చంద్రబాబును.. నారాయణ (narayana), బీద రవిచంద్ర (ravichandra), అబ్దుల్ అజీజ్ (abdul azeez) కలిశారు. ఇంతలోనే లోకేశ్ వర్గం గిరిధర్ రెడ్డిని (giridhar reddy) యువగళం పాదయాత్రకు తీసుకెళ్లి.. కలిపించడంతో సీనియర్లు లోలోన కుమిలిపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సీఎం అవుతారని లోకేశ్ (lokesh) చెబుతున్నారు. కానీ రియాల్టీ అలా ఉండదని.. తమకు టికెట్ ఇస్తారో లేదోననే సందేహాం సీనియర్లలో ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి (somireddy chandra mohan reddy) జిల్లాలో మంచి పట్టు ఉంది. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉండటంతో గతంలో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవీ అప్పగించారు. ఈ సారి తమ సంగతేంటి అని సీనియర్లు అంటున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరితే.. తనకు వచ్చే మంత్రి పదవీకి ఎసరు వచ్చే పరిస్థితి అని సీనియర్లు లోలోన అనుకుంటున్నారట.