»Somireddy Chandramohan Reddy Deeksha Was Destroyed By The Police Nellore Ap
Somireddy chandramohan reddy: దీక్ష భగ్నం చేసిన పోలీసులు
నెల్లూరు జిల్లా వరదాపురం గ్రామంలో గడువు పూర్తైన మైకా క్వారీ నుంచి అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నానరని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు బలవంతంగా విరమింపజేశారు.
somireddy chandramohan reddy Deeksha was destroyed by the police nellore ap
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామంలో ప్రస్తుతం పనిచేయని రుస్తుం మైకా మైన్‌లో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు లభ్యం కావడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(somireddy chandramohan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గనిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని “అక్రమ” మైనింగ్‌కు వ్యతిరేకంగా తవ్వుతున్నారని టీడీపీ నేత నిరసన వ్యక్తం చేస్తూ గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. అంతేకాదు ఈ నెల ప్రారంభంలోనే ఏపీ హైకోర్టు ఆ స్థలంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు అక్రమంగా తవ్వకాలు చేపట్టడం వల్ల సమీపంలోని నివాసాల భద్రత ప్రమాదంలో పడుతుందని సోమిరెడ్డి అన్నారు. గత కొన్ని నెలలుగా క్వార్ట్జ్ వెలికితీత కోసం స్థానిక వైఎస్ఆర్సీ నాయకులు గనిని అక్రమంగా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. పేలుడు పదార్థాల నిల్వపై విచారణ జరిపి నేరస్థులపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను తక్షణమే నియమించాలని కోరుతూ పేలుడు పదార్థాల డిప్యూటీ చీఫ్ కంట్రోలర్‌ను సంప్రదించానని ఆయన చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న బ్లాస్టింగ్ కార్యకలాపాలన్నింటినీ అరికట్టాలని, అలాంటి వాహనాలను సీజ్ చేయాలని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా గని వెలుపల నిరసన చేస్తున్నా కూడా జిల్లా యంత్రాంగం లేదా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ అంశంపై నెల్లూరు(nellore) ఎస్పీ, కలెక్టర్ మౌనం వహించడాన్ని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే తాజాగా సోమవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో దీక్షా(Deeksha)శిబిరం వద్దకు చేరుకుని సోమిరెడ్డిని అక్కడి నుంచి పోలీసులు(police) బలవంతంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు వాగ్వాదం ఏర్పడింది. టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో సోమిరెడ్డి దీక్ష భగ్నం చేసిన పోలీసులు అతన్ని ఇంటి వద్ద దించేశారు.