»Every 10 People 2 Are Infected Corona In Hyderadad
Every 10 peopleలో ఇద్దరికీ కరోనా.. ఎక్కడంటే…?
Corona in Hyderadad:కరోనా వైరస్ (coronavirus) మళ్లీ కోరలు చాపుతున్నట్టే అనిపిస్తోంది. చాపకింద నీరులా కేసులు మళ్లీ వెలుగుచూస్తున్నాయి. కరోనా.. ఇన్ ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఒకేలా ఉండటం.. వాతావరణం మార్పు నేపథ్యంలో కొందరు టెస్ట్ చేసుకోగా.. ప్రతీ 10 మందిలో ఇద్దరు లేదంటే ముగ్గురికి పాజిటివ్ వస్తోంది.
Every 10 people 2 are infected corona in Hyderadad
Corona in Hyderadad:కరోనా వైరస్ (coronavirus) మళ్లీ కోరలు చాపుతున్నట్టే అనిపిస్తోంది. చాపకింద నీరులా కేసులు మళ్లీ వెలుగుచూస్తున్నాయి. ఉపరితర ఆవర్తనం ఏర్పడటంతో ఇటీవల తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా హైదరాబాద్‌లో (Hyderabad) వాతావరణం అనూహ్యంగా మారింది. దీంతో జ్వరాలు (fever), జలుబు (cold), దగ్గు (cough) ఎక్కువయ్యాయి. కొందరు మెడికల్ షాపుల్లో (medical shop) మందులు తీసుకున్నా తగ్గకపోవడంతో వైద్యులను ఆశ్రయించాల్సి వచ్చింది. కరోనా.. ఇన్ ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఒకేలా ఉండటం.. వాతావరణం మార్పు నేపథ్యంలో కొందరు టెస్ట్ చేసుకున్నారు.
రెండు, మూడురోజులు అయినా జ్వరం, జలుబు, దగ్గు తగ్గగపోవడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్ (positive) వస్తోందని తెలిసింది. అలా హైదరాబాద్ (hyderabad) నగరంలో ప్రతీ 10 మందిలో ఇద్దిరు లేదంటే ముగ్గురికి పాజిటివ్ వస్తుందట. దీంతో మళ్లీ ఆందోళన నెలకొంది. అయితే అవీ మైల్డ్ కేసులేనని (mild cases) వైద్యులు తెలిపారు. మూడురోజులు అయినా జ్వరం తగ్గకుంటే కరోనా పరీక్ష చేసుకోవాలని వైద్యులు సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇప్పుడు వైరస్ (virus) ఇంపాక్ట్ అంతగా లేదని చెబుతున్నారు.
దేశంలో వస్తోన్న కరోనా వేరియంట్‌ను (corona varient) ఎక్స్‌బీబీ 1.16గా గుర్తించారు. ఈ వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తోందని వైద్యులు (doctors) చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ (second wave) అల్లాడించింది. దాదాపు ఇంటింటికీ వైరస్ (virus) సోకింది. సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్న వారు మాత్రమే బతికి బట్టకట్టారు. నిర్లక్ష్యం చేసిన వారు మాత్రం ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారిలో యువతే (youth) ఎక్కువ ఉండటం ఆందోళన కలిగించింది. ఆ తర్వాత థర్డ్, ఫోర్త్ వేవ్ వచ్చినా.. అంతలా ప్రభావం చూపలేదు.
ఇప్పుడు కొత్త వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దీంతోపాటు ఇన్ ఫ్లూయెంజా వైరస్ కూడా కాస్త భయపెట్టింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కేసులు మాత్రం నమోదు కాలేదు. దీంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు.