»Yadadri Laxmi Narasimha Swamy Temple Completed One Year
Yadadri ఆలయానికి ఏడాది.. ఎంత మంది దర్శించుకున్నారంటే..?
తెలంగాణ తిరుమలగా యాదాద్రి (Yadadri Temple Development Authority -YTDA) ఆలయం వెలుగుతోంది. తిరుమల తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రోజుకు కనీసం 10 వేల నుంచి 30 వేల మధ్య భక్తులు వస్తుండగా.. వారాంతాల్లో 75 వేలకు చేరుతోంది.
భారతదేశంలో.. ప్రపంచంలో ఒక ప్రభుత్వం ఆలయాన్ని కోట్లు ఖర్చు చేసి అద్భుతంగా ఆలయం (Temple) నిర్మించడం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చు. తెలంగాణ ఇలవేల్పుగా ఉన్న యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy Temple) ఆలయ పునర్నిర్మాణం (Re Construct) గొప్ప సంకల్పంతో జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని కృష్ణ శిలలతో (Krishna Stones) సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఈ ఆలయ పరిసరాలు ప్రస్తుతం ఆలయ నగరి (Temple City)గా వెలుగొందుతున్నది. తిరుమల తరహాలో రోజుకో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆలయం పునరుద్ఘాటన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 1.10 కోట్ల మంది భక్తులు (Pilgrims) దర్శించుకోవడం విశేషం.
స్వయంభూ లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని మార్చి 28న సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao), శోభ (Kalvakuntal Shobha) దంపతులతో పాటు మంత్రులు (Ministers), ప్రజాప్రతినిధుల చేతులమీదుగా మహాకుంభ సంప్రోక్షణతో పునరుద్ఘాటన జరిగింది. కన్నుల పండుగగా ఆలయ పున:ప్రారంభ ఉత్సవాలు జరిగాయి. కాగా ఆలయం పున:ప్రారంభమైన అనంతరం యాదాద్రి (Yadadri)కి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతాల్లో ఆలయం కిక్కిరిసిపోతున్నది (Heavy Rush). గతంలో ఏడాదికి 10 లక్షలు కూడా దాటని సంఖ్య ఇప్పుడు కోటిన్నరకు చేరుతోంది. ఆలయానికి ఆదరణ క్రమంగా పెరుగుతున్నది. ఇక ఆదాయం (Income) కూడా సమకూరుతున్నది.
2018-19లో రూ.99 కోట్లకు పైగా ఆదాయం రాగా.. 2020-21లో రూ.125 కోట్లకు చేరింది. ఇతర విభాగాలు, శాశ్వత పూజలు, అన్నదానంపై మార్చి 28, 2022 నుంచి మార్చి 25, 2023 వరకు రూ.180, 96, 21, 812 ఆదాయం సమకూరింది. ఇక హుండీ ఆదాయం రెట్టింపైంది. రెండేళ్ల కిందట రూ.10 కోట్లు.. తాజాగా రూ.12 కోట్లు చేరింది. ఇక ఆలయానికి బంగారు, వెండి రూపాల్లో భారీగా ఆభరణలు వస్తున్నాయి. ఇలా యాదాద్రి వైభవం దశదిశలా వ్యాపిస్తోంది. తెలంగాణ తిరుమలగా యాదాద్రి (Yadadri Temple Development Authority -YTDA) ఆలయం వెలుగుతోంది. తిరుమల తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రోజుకు కనీసం 10 వేల నుంచి 30 వేల మధ్య భక్తులు వస్తుండగా.. వారాంతాల్లో 75 వేలకు చేరుతోంది.