»20 Hajj Pilgrims Killed In Saudi Arabia Bus Accident
Saudi Arabia హజ్ యాత్రలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భక్తులు ఎక్కడి వారు అనేది వివరాలు తెలియాలి. మృతులు, క్షతగాత్రులు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి మీడియా చెబుతున్నది.
పవిత్ర మక్కా (Mecca)ను సందర్శనకు వెళ్లే హజ్ యాత్ర (Hajj Tour)లో ఘోరం చోటుచేసుకుంది. హజ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు వంతెనను ఢీకొట్టడంతో మంటల్లో చిక్కుకుంది. ఆ మంటల్లోనే 20 మంది సజీవ దహనం కాగా.. 29 మంది గాయపడ్డారు. అయితే ఈ సంఘటనకు బస్సు బ్రేకులు ఫెయిల్ (Bus Accident) కావడమే కారణంగా తెలుస్తున్నది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Fire Department), పోలీసులు (Saudi Police) సహాయ చర్యలు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం మొదలు కావడంతో పెద్ద ఎత్తున ముస్లింలు (Muslims) సౌదీ అరేబియాలోని (Saudi Arabia) హజ్ సందర్శనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ బస్సులో సోమవారం దాదాపు 50 మందికి పైగా భక్తులు (Pilgrims) ఉమ్రా సందర్శన కోసం వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మార్గమధ్యలో బస్సు అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. వంతెనను ఢీకొట్టగానే వెంటనే మంటలు వ్యాపించాయి. భక్తులు హాహాకారాలతో సహాయం కోసం అరిచారు. అయితే మంటలు అత్యంత వేగంగా వ్యాపించడంతో భక్తులు తప్పించుకోలేకపోయారు. కొందరు తప్పించుకుని ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భక్తులు ఎక్కడి వారు అనేది వివరాలు తెలియాలి. మృతులు, క్షతగాత్రులు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి మీడియా చెబుతున్నది.