ప్రకాశం: ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని ప్రిన్సిపల్ వీకే గీతాలక్ష్మి తెలిపారు. జనవరి 18న ఉదయం 11 గంటలకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9951091988 నంబరును సంప్రదించాలని సూచించారు.