»Allu Arjun Wife Allu Sneha Reddy Shares Her Latest Fitness Video Goes Viral
Allu Sneha Reddy: అల్లు స్నేహా ఫిట్నెస్ వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనే కాదు ఆయన భార్య అల్లు స్నేహా(Allu Sneha) కూడా సోషల్ మీడియాలో పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లు స్నేహా ఎక్కువగా ఫిట్ నెస్ వీడియో(Fitness Videos)లను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను పంచుకునే స్నేహారెడ్డి(Sneha Reddy) తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఓ ఫిట్ నెస్ వీడియోను షేర్ చేశారు.

ఇన్స్టాగ్రామ్ వేదికగా అల్లు స్నేహారెడ్డి(Allu Sneha) ఓ వీడియోను షేర్ చేశారు. 2023లో తన ఫిట్ నెస్ గోల్స్ ఇవేనంటూ వీడియోను అల్లు స్నేహా పోస్టు చేశారు. బరువు తగ్గడం కాదని, శక్తివంతం కావాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అలాగే భౌతిక ఆరోగ్యానికి బదులుగా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలనుకుంటున్నట్లు అల్లు స్నేహా తెలిపారు.
ఫిట్ నెస్(Fitness) అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించినదని, ఈ ఏడాది తాను తన ఫిట్ నెస్ జర్నీని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నానని క్యాప్షన్ ఇచ్చి వీడియోను అల్లు స్నేహారెడ్డి షేర్ చేశారు. ప్రస్తుతం స్నేహాకు ఇన్ స్టాలో ఏకంగా 8.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు స్నేహారెడ్డి(Allu Sneha) పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది.