Ram Charan : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్.. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్నారు. ట్రిపుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న చరణ్‌కి.. అదిరిపోయేలా బర్త్ డే ట్రీట్ ఇచ్చారు అభిమానులు. చరణ్ కూడా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 15 టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్.. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్నారు. ట్రిపుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న చరణ్‌కి.. అదిరిపోయేలా బర్త్ డే ట్రీట్ ఇచ్చారు అభిమానులు. చరణ్ కూడా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 15 టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమాకు గ్లోబల్ టచ్ ఇచ్చేలా ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేసారు. అయితే మగధీర కాకుండా.. ఈ ఫ్లాప్ సినిమాని మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లి ఎవరు చూస్తారులే అనే కామెంట్స్ వినిపించాయి. కానీ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డ్ పడిపోయాయి. వీకెండ్ కావడంతో.. చరణ్ కొత్త సినిమా రిలీజ్ అయిన రేంజ్లో రచ్చ చేశారు మెగా ఫ్యాన్స్. అసలు ఒక ఫ్లాప్ మూవీ రీ రిలీజ్ అయితే ఇంత రెస్పాన్స్ వస్తుందా.. అనేలా ఉన్నాయట వసూళ్లు. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఈ సినిమాకి మొదటి రోజు కోటి 75 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో జల్సా, ఖుషి తర్వాత ఆరెంజ్ నిలిచిందని అంటున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ సినిమా రీ రిలీజ్‌కి.. ఈ రేంజ్ వసూళ్లు రావడం కూడా ఓ రికార్డేనని అంటున్నారు. ఇక సినిమా స్పెషల్ షోలకు వస్తున్న రెస్పాన్స్‌తో ఆరెంజ్ మూవీ డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. హైదరాబాద్‌లోని దేవి థియేటర్లో.. ఫ్యాన్స్ మధ్య మళ్లీ ఈ సినిమాను ఎంజాయ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఒక సముద్రాన్ని చూస్తున్నట్టుందని రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాతో వచ్చిన ప్రతి రూపాయి జనసేన పార్టీ కోసమే. అందుకే నాగబాబు ‘మగధీర’ కాకుండా ‘ఆరెంజ్’ను రీ రిలీజ్ చేశారు.