NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నర్రా రాఘవరెడ్డి పేరున కవి ఏబూషి నర్సింహా రాసిన పాటల సీడీని బుధవారం ఆవిష్కరించిన సభలో సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జన హృదయ నేతగానే కాకుండా ప్రజా కళాకారుడిగా ప్రజల సమస్యల పరిష్కారానికి జీవితం అంతా కృషి చేసిన కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి సేవలు మరువలేనివి అని అన్నారు.