ELR: ముదినేపల్లి మండలం వడాలిలో అనుమానాస్పదస్థితిలో వివాహిత తనుశ్రీ మృతి చెందిన సంఘటనలో ఆమె భర్త బెజవాడ అనిల్ కుమార్ను బుధవారం డీఎస్పీ శ్రావణ కుమార్ను అరెస్టు చేశారు. సోమవారం తనుశ్రీ భర్త వేధింపులు తట్టుకోలేక మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కైకలూరు న్యాయస్థానానికి తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.