KKD: దివ్యాంగులను సానుభూతితో గాకుండా మానవత్వంతో చూడాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. బుధవారం కరప మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. వారికిస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ అనుపమ, ఎంఈఓలు కృష్ణవేణి, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.