TG: కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్సింగ్కు మాజీమంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపుతో పౌరుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయన్నారు. భూటాన్, పాక్, శ్రీలంక కంటే భారత్లోనే పెట్రోల్ రేట్లు అధికం అని తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ఆయిల్ ధరలు తగ్గినా కేంద్రం తగ్గించలేదని పేర్కొన్నారు.