AP: ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి జరుగుతుందని వెల్లడించారు. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండని సూచించారు. రాష్ట్ర ఆదాయ లక్ష్యం రూ.1.37 లక్షల కోట్ల సాధనపై దృష్టి పెట్టాలని తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదు అవుతోందని సీఎం పేర్కొన్నారు.