HYD: తాగునీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని, మోటార్‌ను సీజ్ చేయడంతోపాటు నీటి కనెక్షన్ కట్ చేస్తామని జలమండలి ఎండీ హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.