ATP: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సమాచారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కు తెలియడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మరణ వార్త విన్న నా మనసు తీవ్రంగా కలచి వేసిందని మన దేశానికి ఎన్నటికీ తీరనిలోటు అని ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు.