W.G: తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. రామకృష్ణ తెలిపారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్నాధపురం గ్రామానికి విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.