ATP: వైసీపీ ఆడుతున్న నాటకాలు ఇప్పటికైనా ఆపాలని, వైసీపీ నాయకులు ధర్నాలు చేయాల్సింది రోడ్లపై కాదు జగన్ ఇంటి వద్ద అని అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. వైసీపీ విద్యుత్ చార్జీల పోరుబాటుపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు.