AP: తెలుగు భాష పరిరక్షణకు రామోజీరావు ఎంతో కృషి చేశారని, తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. తెలుగు రచయితల మహాసభలో ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడారు. ప్రాచీన భాషగా తెలుగు గుర్తింపు పొందిందన్నారు. మన తెలుగును 100 బిలియన్ల మంది మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సంగీతం తరహాలో అందమైనది తెలుగు భాష అని తెలిపారు.