VZM: ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.