సిద్దిపేట: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 11వ వార్డులో బైకుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది. వార్డుకు చెందిన మహమ్మద్ ముస్తఫా బైకును ఇంటిముందు పార్క్ చేసి ఉండగా గుర్తుతెలియని వ్యక్తి బురకలో వచ్చి బైకుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితులు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి బైకు పూర్తిగా దగ్ధమయ్యిందని బాధితుడు తెలిపాడు.