PLD: మండల కేంద్రమైన నకరికల్లులో అద్దంకి-నార్కెట్ పల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో మలుపు తిరుగుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.