VZM: కొత్తవలస మండలంలో ఇటీవల జరిగిన రీ సర్వే, రెవెన్యూ సదస్సులపై మండల తహసీల్దార్ బి. నీలకంఠరావు విఆర్వో, విలేజ్ సెక్రటరీలతో సమావేశమయ్యారు.వచ్చిన అర్జీలు నిశితంగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సరిహద్దు రైతులకు కొలతలపై సందేహాలు ఉంటే స్వయంగా భూమి మీదకు వెళ్ళి నివృత్తి చేసి, పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డి. టి పాల్గొన్నారు.