గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో YCP నేతలకు ఊరట లభించింది. ఈ కేసులో YCP నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే 33 మందిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. SC, ST స్పెషల్ కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. రెండు వారాల్లో స్పెషల్ కోర్టు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు రావాలని YCP నేతలకు తెలిపింది. ఈ కేసులో 88 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు.