గుంటూరు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తెనాలికి చెందిన బూరెల నాంచారమ్మ ఎంపికయ్యారు. గతంలో వైసీపీ తెనాలి పట్టణ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె వరుసగా రెండోసారి జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక అవ్వడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. కాగా నాంచారమ్మ భర్త బూరెల దుర్గాప్రసాద్ వైఎస్ఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా పనిచేశారు.