NDL: గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ప్రకాష్ బాబు అన్నారు. శనివారం బేతంచర్ల మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ గుమ్మగాళ్ల రాజు, వైస్ ఎంపీపీ వెంకట సుబ్బమ్మ, వీఆర్వో మధు, రెవిన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించారు.