JN: ప్రపంచం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలతో కలిసి కడియం శ్రీహరి నివాళులర్పించారు. నేడు భారత దేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప ఆర్థిక వేత్త అని కొనియాడారు.