NLR: కొడవలూరు మండలంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. యల్లాయపాలెం తెల్లమిట్ట గిరిజన కాలనీకి చెందిన పొట్లూరు పొలయ్య (70)ను అతడి కుమారుడు సుబ్రహ్మణ్యం మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపాడు. కేకలు విన్న చుట్టు పక్కల వారు ఘటనా స్థలానికి వెళ్లేసరికి పొలయ్య రక్తం మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. SI కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.