సత్యసాయి: ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణ శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించి రికార్డులను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. నెలవారి సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలను పేషెంట్లను అడిగి వారు తెలుసుకున్నారు.