BGT ట్రోఫీకి అనుభవం లేని నితీష్ ఎంపికపై చర్చలు జరిగాయి. ఎంపికైనా కూడా తుది జట్టులో ఉండకపోవచ్చనని అనుకున్నారంతా. కానీ మొదటి టెస్టులోనే ఛాన్స్ రావడంతో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఈ సిరీస్‌లో 38, 41, 42, 42, 16 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇవాళ్టి ఇన్నింగ్స్‌తో జట్టులో చోటు కష్టమనుకున్నా, అతడు రియల్ ‘గేమ్ ఛేంజర్’లా మారాడని పోస్టులు పెడుతున్నారు.