NLG: నిడమనూరు మండలం మారుతి వారి గూడెంకి చెందిన మెరుగు శేఖర్‌కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్ రెడ్డి, మేరెడ్డి వెంకటరమణ, కొంచం సతీష్, మేరెడ్డి శివనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.