Vammo..స్విగ్గీ ఫుడ్‌లో బొద్దింక.. ఎక్కడో కాదు ఇక్కడే
Cockroach in swiggy food:ఫుడ్ ఆర్డర్ (order) చేసిన ఓ వ్యక్తి ఖంగుతిన్నాడు. తన ఫుడ్‌తో పాటు అందులో బొద్దింక (Cockroach) కూడా వచ్చింది. వెంటనే బ్రాంచి వారితో మాట్లాడగా.. వెంటనే డబ్బులు రిటర్న్ (money return) చేసేసింది. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున జరిగింది.
Cockroach in swiggy food:ఇప్పుడు అంతా ఆన్ లైన్.. వస్తువులే కాదు, ఫుడ్ (food) కూడా ఆర్డర్ (order) చేస్తున్నారు. స్విగ్గీ (swiggy), జొమాటో (zomato) నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. మిగతా కంపెనీలు వచ్చినా.. అంతలా ఆదరణ పొందలేదు. అలా ఆర్డర్ (order) చేసిన ఓ వ్యక్తి ఖంగుతిన్నాడు. తన ఫుడ్‌తో పాటు అందులో బొద్దింక (Cockroach) కూడా వచ్చింది. వెంటనే బ్రాంచి వారితో మాట్లాడగా.. వెంటనే డబ్బులు రిటర్న్ (money return) చేసేసింది. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున జరిగింది. సో.. ఫుడ్ ఆర్డర్ చేసే విషయంలో ఒకసారి ఆలోచించాలని సదరు వ్యక్తి కోరుతున్నాడు.
మహ్మద్ ముజీబ్ (mujeeb) వ్యక్తి సికింద్రాబాద్ కరాచీ బేకరీ (karachi bakery) నుంచి స్విగ్గీలో (swiggy) చోలే బటర్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. తినేందుకు ట్రై చేయగా.. అందులో బొద్దింక (Cockroach) కనిపించింది. ఇంకేముంది వెంటనే కరాచీ బేకరీకి ఫోన్ చేశాడు. బొద్దింక (Cockroach) వచ్చిందని చెప్పగా.. వారు క్షమాపణ చెప్పడమే గాక.. అతను ఇచ్చిన నగదును కూడా వెంటనే ట్రాన్స్ ఫర్ చేసేశారు. తనలా మరొకరు ఇబ్బంది పడొద్దని ఫుడ్ సేప్టీ (food safety) అధికారులు, స్విగ్గీకి (swiggy) ఈ విషయం ట్వీట్ చేశాడు. వెంటనే స్విగ్గీ (swiggy) కూడా రియాక్ట్ అయ్యింది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని.. తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.
కాస్త ఆలస్యమైనా.. ఓపిక ఉన్నా లేకున్నా.. సొంతంగా వెళ్లి తినడమే బెటర్. లేదంటే ఇలా బొద్దింకలు.. లేదంటే అపరిశుభ్ర ఆహారం వచ్చే అవకాశం ఉంటుంది. ఓపిక ఉంటే ఇంట్లోనే చక్కగా వండుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. అసలే వేసవి.. ఆపై నీరు, ఇతర కలుషిత వల్ల విరోచనాలు, వాంతులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సో.. ఇంటి పట్టునే ఉండి.. ఇంటి ఫుడ్ తినడం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు కోరుతున్నారు.