»Union Minister Smriti Irani Explained Her Economic Problems In As A Actress
షూటింగ్ లోనే Abortion అయ్యింది: విషాదం పంచుకున్న కేంద్ర మంత్రి
స్మృతీ తన చేదు అనుభవాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం స్మృతీ బీజేపీలో కీలక నాయకురాలి (Senior Leader)గా కొనసాగుతున్నారు. అమేఠీ (Amethi)లో సవాల్ చేసి మరీ రికార్డు మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ (BJP)లో ఆమె ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగింది.
కేంద్ర మంత్రి (Union Minister) స్మృతీ ఇరానీ (Smriti Irani) వరుసగా తన జీవితం (Life)లోని విషాద సంఘటనలను పంచుకుంటున్నారు. ఆమె రాజకీయా (Politics)ల్లోకి రాకముందు సీరియల్స్ (Serials), సినిమా (Movies)ల్లో నటించారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్.శంకర్ (N Shankar) తీసిన ‘జై బోలో తెలంగాణ’ (Jai Bolo Telangana)లో స్మృతీ ఇరానీ హీరో తల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూ (Interview)లో ఆమె తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలను వివరించి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే షూటింగ్ సమయం (Shooting Time)లోనే తనకు గర్భస్రావం (Abortion) అయ్యిందని వాపోయారు.
‘క్యూంకీ సాస్ బీ కబీ బహు థీ’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) అనే సీరియల్ స్మృతీ ఇరానీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సీరియల్ షూటింగ్ కు క్రమం తప్పకుండా వెళ్లేదానిని అని స్మృతీ తెలిపారు. అయితే ఆర్థిక కష్టాలు, ఈఎంఐ (EMI’s)లు అధికంగా ఉండడంతో షూటింగ్ కు ఏనాడూ విరామం ఇవ్వలేదని.. అనారోగ్యం ఉన్నా నటించినట్లు వివరించారు. ‘ఈ క్రమంలోనే ఒక రోజు షూటింగ్ కు రాగా నీరసంగా అనిపించింది. ఓపిక లేదని, ఇంటికి వెళ్లిపోతానని చిత్రబృందానికి అడిగాను. కానీ పని ఎక్కువగా ఉండడం వల్ల చేసేది లేక సాయంత్రం వరకు సెట్ (Set)లోనే ఉన్నా. అనంతరం సాయంత్రం ఆస్పత్రికి (Hospital) వెళ్లి చూయించుకోగా.. నాకు గర్భస్రావం (అబార్షన్) అయ్యిందని వైద్యులు తెలిపారు. ఆ విషయం నాకు తీరని విషాదం నింపింది’ అని స్మృతీ పంచుకున్నారు.
ఇక గర్భస్రావం అనంతరం పరిస్థితులను కూడా వివరించారు. ‘షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుందాం అంటే ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్ కు వెళ్లా. అయితే ఈ విషయంలో ఓ వ్యక్తి పుకార్లు పుట్టించాడు. నాకు గర్భస్రావం కాలేదని, అబద్ధాలు చెబుతున్నాను అంటూ ఆరోపణలు చేశాడు. నాకు కోపమొచ్చి రిపోర్టులు తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తా కపూర్ (Ekta Kapoor)కు చూపించా. గర్భస్రావం నిజమని నమ్మించడానికి అలా చేశా’ అంటూ స్మృతీ తన చేదు అనుభవాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం స్మృతీ బీజేపీలో కీలక నాయకురాలి (Senior Leader)గా కొనసాగుతున్నారు. అమేఠీ (Amethi)లో సవాల్ చేసి మరీ రికార్డు మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ (BJP)లో ఆమె ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగింది.