Shaakuntalam: శాకుంతలం 3D ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్(Tollywood)లో రూపొందుతోన్న మరో పాన్ ఇండియా మూవీ శాకుంతలం(Shaakuntalam). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్(Gunasekhar) మైథలాజికల్ సబ్జెక్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సమంత(Samantha) శకుంతల పాత్రలో కనిపిస్తోంది. ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

శాకుంతలం ట్రైలర్:
ఇప్పటికే ఈ సినిమా(Movie)కు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు విడుదల(Release) అయ్యాయి. అవన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీని 3Dలోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ 3D ట్రైలర్‌ను మార్చి 28వ తేది సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్(Makers) వెల్లడించింది.
ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్6లో ఈ ట్రైలర్ లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంలో ఈ మైథలాజికల్ డ్రామా శాకుంతలం(Shaakuntalam) రూపొందుతోంది. ఈ మూవీలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు(Mohan Babu), అల్లు అర్హ వంటివారు ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ(Manisharma) సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 14వ తేదిన ఈ సినిమాను రిలీజ్(Release) చేయనున్నారు.