మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(allu arjun and ram charan) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్లతో మల్టీస్టారర్ మూవీ తీయాలనేది మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కోరిక. అందుకే గత పదేళ్లుగా ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్ను రెన్యువల్ చేయిస్తున్నానని.. ఇటీవలె ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు మెగాభిమానులు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో.. చరణ్-అర్జున్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్తో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. వంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. అందుకే మరోసారి బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ కోసం అల్లు అరవింద్ గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎస్ఎస్ఎంబీ28.. బన్నీ ‘పుష్ప2’.. చరణ్ ‘ఆర్సీ 15’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత వీళ్లు మరో కొత్త సినిమా కమిట్ అవలేదు. కాబట్టి.. అనుకున్న దానికంటే ముందే ఈ కాంబినేషన్ సెట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఇదే నిజమైతే మెగాభిమానులకు పండగేనని చెప్పొచ్చు.