దేశీయ మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా.. కొత్త ఎస్పీ160 బైక్ను లాంచ్ చేసింది. ఆ సంస్థ ఇటీవల ఎస్పీ 125ని లాంచ్ చేయగా.. తాజాగా ఎస్పీ160ని తీసుకొచ్చింది. దీని ధర రూ.1,21,951. హై ఎండ్ వేరియంట్ ధర రూ.1.27 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఎస్పీ 160లో 4.2 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది.