»Manchu Vishnu Responded To Manojs Video And Mohan Babu Also Serious
Manchu Vishnu: మనోజ్ వీడియోపై స్పందించిన విష్ణు..మెహన్ బాబు సిరీయస్!
మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.
మంచు మోహన్ బాబు(Mohan Babu) కుమారులు విష్ణు(manchu Vishnu), మనోజ్(manchu manoj) మధ్య గత కొన్ని రోజులుగా వైరం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న మనోజ్ షేర్ చేసిన వీడియో ద్వారా వీరి మధ్య గొడవలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీడియోలో విష్ణు తన మనుషులను కొట్టాడని, గతంలో కూడా అలానే చేశాడంటూ మంచు మనోజ్(manoj) వీడియోలో చెప్పడం గమనించవచ్చు. విష్ణు తరచూ ఇంట్లోకి చొరబడి తన మనుషులను కొట్టేవాడని మనోజ్ చెబుతున్నారు. ఇలా ఇంటికి వచ్చి మా వాళ్ళని కొట్టడమెంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ తర్వాత మనోజ్ తన సోషల్ మీడియా(social media) ఖాతా నుంచి ఆ వీడియోను తొలగించాడు. కానీ అసలు ఏం జరిగిందంటూ జనాలు ఆరా తీయడం మొదలు పెట్టారు.
అయితే విష్ణు దాడికి ప్రయత్నించిన ఘటనలో మనోజ్ మేనేజర్ సారథి(manager sarathi)కి గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సారథి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో సారథి మా ఎన్నికల సమయంలో కూడా విష్ణుకు దగ్గరగా ఉన్నారు. కానీ ప్రస్తుతం సారథి మనోజ్ వైపు ఉండి అన్ని పనులను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సారథి మనస్పర్దలు సృష్టించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడి ఘటన నేపథ్యంలో సారథికి గాయాలు కాగా ఆస్పత్రిలో కూడా చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. ఇది తెలిసిన మోహన్ బాబు(Mohan Babu) తన కుమారులపై సిరీయస్ కావడంతో ఆ వీడియో తొలిగించారని తెలిసింది.
ఇది చాలా చిన్న గొడవ అని విష్ణు అన్నారు. దీనిపై మనోజ్ స్పందించాల్సిన అవసరం లేదు, మనోజ్ చిన్న వాడని విష్ణు తెలిపారు. దీనిపై స్పందించాల్సిన విషయం లేదని చెప్పుకొచ్చారు. మా సోదరుల మధ్య సాధారణ గొడవనని తెలిపారు. మరోవైపు ఈ గొడవ తనకేమీ తెలియదని వారి సోదరి లక్ష్మి మంచు తెలిపింది. తాను ఈ వీడియో చూడలేదని, అన్నీ తెలిసిన తర్వాతే మాట్లాడతానని చెప్పింది.
మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో ఉంటుండగా.. మంచు మనోజ్ మాత్రం విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు ఏళ్లుగా విష్ణు పుట్టినరోజుకి కూడా మనోజ్ శుభాకాంక్షలు చెప్పలేదు. మరోవైపు మనోజ్ పెళ్లికి కూడా విష్ణు ఓ గెస్టు మాదిరిగా వచ్చి వెళ్లాడు. తాజాగా విడుదలైన ఈ వీడియో చూస్తే మంచు సోదరుల మధ్య విభేదాలు మరింత పెరిగే విధంగా అనిపిస్తుంది. నటుడు మంచు మనోజ్ మార్చి 3, 2023న లక్ష్మి మంచు ఇంట్లో భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు.