SKLM: ఎచ్చెర్లలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో మూడేళ్ల ఎల్.ఎల్.బిలో 13 మిగులు సీట్లకు ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. 52 మంది దరఖాస్తు చేసుకోగా వీసీ కె.ఆర్. రజిని సోమవారం సీట్లు ఎలాట్ చేశారు. 13 సీట్లలో ఈడబ్ల్యూఎస్ సీట్లు రెండు ఉన్నాయి. లాసెట్ 2024 ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారం గా ప్రవేశాలు కల్పించారు.