సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ సినిమా 3డి వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మువీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రష్మికా మందన్న, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.