ఒంగోలు నియోజకవర్గంలో 21 మందికి సీఎం సహాయనిధి నుంచి రూ.54 లక్షల మంజూరయ్యాయి. ఒంగోలులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రులలో వైద్యం పొందుతు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారికి వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు.