E.G: అంగన్వాడీలకు చిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలోని కూటమి కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.