»Mohan Babu Responds On Manchu Manoj Marriage With Bhuma Mounika
Mohan Babu: విబేధాలపై మోహన్ బాబు ఏమన్నారంటే
సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.
సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు. మంచు మనోజ్ – భూమా మౌనికలు (Bhuma Mounika) మార్చి 3వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం సాగింది. మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదంటూ వచ్చిన వార్తలు పనికి మాలినవి అన్నారు. ఓ సమయంలో మనోజ్ తన వద్దకు వచ్చి మౌనికను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఓసారి ఆలోచించుకోమని మాత్రమే చెప్పానని అన్నారు. అయితే మనోజ్ తాను ప్రేమించిన విషయాన్ని, తన పరిస్థితిని మొత్తం చెప్పాడని, మౌనికనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని, ఇదే విషయం తనతో సూటిగా చెప్పాడన్నారు. దీంతో తాను కూడా సరే చేసుకోమని చెప్పినట్లు తెలిపారు.
కానీ కొంతమంది తనకు ఇష్టం లేదని చెబుతున్నారని, ఎవరో ఏదో అనుకుంటే తాను పట్టించుకోనని మోహన్ బాబు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ ను పక్కన పెట్టాలని అభిప్రాయపడ్డారు. రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే, పక్కన కుక్కలు ఎన్నో మొరుగుతుంటాయని, వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేమన్నారు.
మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య విబేధాలు వచ్చినట్లుగా జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడాలనే ఆలోచనలో మోహన్ బాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు తనయుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
మోహన్ బాబు సమీప బంధువు సారథి విషయంలో తాజాగా అన్నదమ్ముల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అప్పటికే రెండేళ్లుగా విష్ణు – మనోజ్ మధ్య గ్యాప్ కనిపిస్తోందని అంటున్నారు. సారథి మొదటి నుండి మంచు విష్ణుకు అనుచరుడిగా ఉన్నారు. మా ఎన్నికల సమయంలోను అన్నతోనే ఉన్నాడు. కానీ ఆ తర్వాత క్రమంగా అతనికి దూరం జరిగి… తమ్ముడు మంచు మనోజ్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు తమ్ముడికి అనుచరుడిగా ఉన్నాడు. మనోజ్ పెళ్లి సమయంలోను విబేధాలు కనిపించాయని అంటున్నారు.
సారథి కారణంగా తమ అన్నదమ్ముల మధ్య విబేధాలు వచ్చాయని విష్ణు అతనిపై ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు తన గురించి అనుచితంగా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. దీంతో సారథి వద్దకు వెళ్లి విష్ణు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. దాడి విషయం తెలియగానే మనోజ్, సోదరి లక్ష్మీ ప్రసన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను మనోజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీడియో తొలగించినట్లుగా తెలుస్తోంది.