డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(puri jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయినా, ఫట్ అయినా.. సినిమా తీయడమే పూరి పని. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎగసిపడే కెరటంలాంటి వాడు పూరి. అందుకే హిట్ అయితే పొంగిపోవడం.. ఫ్లాప్ అయితే కృంగిపోవడం పూరికి చాతకాదు. కానీ లైగర్ సినిమా మాత్రం పూరిని కాస్త గట్టిగానే దెబ్బేసింది. అందుకే సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే లైగర్ తర్వాత దర్శకుడిగా కంటే.. నటుడిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాడు పూరి. ఇటీవల మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీలో జర్నలిస్టు పాత్రలో కనిపించాడు పూరి. కేవలం ఆ పాత్ర చేయడమే కాదు.. ఈ సినిమా కథను కూడా నరేట్ చేశాడు. దాంతో పూరి నటన పరంగా అడుగులెస్తున్నట్టే కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాలో కూడా మెరిశాడు పూరి. ఇందులో ఆడిషన్స్‌కు వచ్చిన విశ్వక్‌ను టెస్ట్ చేసి చూసే పాత్రలో కనిపించాడు.
అలాగే ఓరి దేవుడా కథను నరేట్ చేశాడు. దాంతో నటుడిగా, నరేటర్‌గా పూరి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడని అంటున్నారు. మన్ముందు పూరికి నటనపరంగా మరిన్ని ఆఫర్లు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది దర్శకులు తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం సముద్రఖని, గౌతమ్ మీనన్ లాంటి డైరెక్టర్స్ నటులుగా కూడా రాణిస్తున్నారు. దాంతో పూరి కూడా యాక్టింగ్ పై దృష్టి పెడితే బాగుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి పూరి రూట్ మారుస్తాడేమో చూడాలి.