»Phone Pay And Google Pay And Paytm Scams Cash By Mistake Deposit
Scams: ఫోన్ పే, గూగుల్ పే..పొరపాటున క్యాష్ వచ్చిందంటూ లూటీ చేస్తారు
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
రోజురోజుకు చీటింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు ఇంకొంత మందిని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఈ క్రమంలో సరికొత్తగా అనేక మంది ప్రతి రోజు వినియోగించే Google Pay, Paytm, PhonePe ల ద్వారా కూడా చీట్ చేసి మనీ లాగేస్తున్నారు. ఎలా అంటే మీరు వాడుతున్న ఫోన్ పే, లేదా గూగుల్ పే నంబర్ కు ఆకస్మాత్తుగా రూపాయి లేదా వంద రూపాయల లోపు క్యాష్ పంపిస్తారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి పొరపాటున నగదు మీకు వచ్చింది. తిరిగి పంపించాలని కోరుతారు.
ఆ నేపథ్యంలో స్పందించి వారికి తిరిగి ఆ నగదును పంపితే తమ అకౌంట్ నుంచి మొత్తం క్యాష్(cash) ఖాళీ అవుతుంది. అయితే తిరిగి మనీ ట్రాన్స్ ఫర్ చేసే క్రమంలో దుండగులు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్ వర్డ్ సహా మీ ఫోన్ హ్యాక్ చేసి అకౌంట్లో ఉన్న మొత్తం నగదును దోచేస్తారు. ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలా ఎవరైనా తిరిగి మనీ పంపమని కోరితే పంపకూడదని సూచిస్తున్నారు. లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
మరోవైపు ఇప్పటికే UPI స్కామ్లలో చాలా మంది వేల, లక్షల రూపాయలను కోల్పోయినట్లు అధికారులు(officers) తెలిపారు. దీంతోపాటు Google Pay, పేటీఎం వంటి యాప్లను ఉపయోగించి కూడా మోసగాళ్లు వ్యక్తులను స్కాం చేస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇంకొన్ని స్కాంలలో స్కామర్స్ కాల్ చేసి బ్యాంక్ లేదా ప్రధాన రిటైల్ ఏజెంట్ అని చెబుతూ ఫోన్లు చేసి మీ పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను అడుగే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకొంత మంది బ్యాంక్ కేవైసీ అప్ డేట్, UPIకి బ్యాంక్ ఖాతా లింక్, ఎనీ డెస్క్ వంటి యాప్ ల ద్వారా కూడా ప్రజలను చీట్ చేసేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.