»The Decision Of 8 Opposition Parties To Fight Against The Center
opposition parties : కేంద్ర పై న్యాయపోరాటానికి 8 విపక్ష పార్టీల నిర్ణయం
కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా గళం విప్పాలని బీఆర్ఎస్, (BRS) టీఎంసీ సహా దేశంలోని పలు విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీబీఐ (CBI) , ఈడీ ఇతర కేంద్ర సంస్థలపై న్యాయపోరాటం చేయనున్నాయి. సుప్రీంకోర్టు (Supreme Court) లేదా ఢిల్లీ హైకోర్టులో (High Court )పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తమపై సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటూ దాడులు చేస్తున్నాయని పలు పార్టీలు ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా గళం విప్పాలని బీఆర్ఎస్, (BRS) టీఎంసీ సహా దేశంలోని పలు విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీబీఐ (CBI) , ఈడీ ఇతర కేంద్ర సంస్థలపై న్యాయపోరాటం చేయనున్నాయి. సుప్రీంకోర్టు (Supreme Court) లేదా ఢిల్లీ హైకోర్టులో (High Court )పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తమపై సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటూ దాడులు చేస్తున్నాయని పలు పార్టీలు ఆరోపించారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ఆదానీ (Adhani) వ్యవహారంపై దర్యాప్తు జరపకపోవటాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు(Filing of Petition) చేయనున్నాయి.
ఈ మేరకు ఇప్పటికే అంతర్గతంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాయి ఎనిమిది పార్టీలు. న్యాయస్థానాలను ఆశ్రయించే విషయంపై సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ (Mamata Banerjee) సహా 8 పార్టీల నేతలు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చినట్లు ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఢిల్లీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ (CM KCR) సహా ఎనిమిది పార్టీల ముఖ్య నేతలు లేఖ రాశారు. కాగా, దేశంలోని ప్రతిపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ ద్వారా వేధిస్తోందని చాలా కాలంగా విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.