W.G: పేరుపాలెం బీచ్ పర్యాటకులకు, మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా మెరైన్, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బీచ్ వద్ద ఈతగాళ్ల ఏర్పాటు, బోట్లతో పహరా, ప్రమాద హెచ్చరిక బోర్డులు, తదితర చర్యలను తీసుకోవాలన్నారు.