TG: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సింగిల్ డిజిట్ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్లో 7.8, హైదరాబాద్లో 14.7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.