ప్రకాశం: సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఫండమెంటల్ లిటరసీ, న్యూమరసీలో భాగంగా జిల్లాలోని రిసోర్స్ పర్సన్లకు ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు ఒంగోలు, మార్కాపురంలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో కిరణకుమార్ తెలిపారు. రోజూ ఉదయం 8 గంటలకు శిక్షణ ప్రారంభం అవుతుందని, సంబంధిత ఎంఈవోలు వారిని విధుల నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.