NLG: కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఊర సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. సతీష్ పేద కుటుంబనికి చెందిన వ్యక్తి,మరియు అతనికి తల్లిదండ్రులు కూడా లేరు. ఇది గమనించిన తోటి స్నేహితులు వైద్య ఖర్చుల కోసం పది వేల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ గణేష్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.