TG: డ్రగ్స్, హుక్కా నియంత్రణపై ప్రభుత్వం సీరియస్గా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే హుక్కా సెంటర్లను నిషేధించిందన్నారు. 12 హుక్కా పార్లర్లు హైకోర్టు అనుమతి తీసుకున్నాయని, చట్ట వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా వదలమన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరూ చట్టం నుంచి పారిపోలేరని హెచ్చరించారు.